కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటుతున్న జిల్లా కలెక్టర్ భరత్‌గుప్తా

Spread the love

 

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి
కలెక్టర్ భరత్‌గుప్తా పిలుపు

చిత్తూరు జనవరి 8 ( గరుడ న్యూస్ )

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని జిల్లా కలెక్టర్ భరత్‌గుప్తా పిలుపునిచ్చారు . రోడ్లు ప్రకృతి వైపరీత్యాల వల్ల చెట్లు నశించి పోతున్నాయని , పర్యావరణాన్ని కాపాడడం తో పాటు నిలవడానికి నీడనిచ్చే చెట్లు ప్రకృతిలో చాలా ముఖ్యమైనవని కలెక్టర్ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయం ఆవరణలో డి ఆర్ ఓ మురళి తో కలసి సోషల్ ఫారెస్ట్ డి ఎఫ్ ఓ శ్రీనివాసులు ఆధ్వర్యం లో ఏర్పాటుచేసిన చెట్లను కలెక్టర్ నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడేందుకు అందరూ సహకరించాలని ఇందుకోసం మొక్కలను విరివిగా నాటాలని కావాల్సిన మొక్కల కోసం అటవీ శాఖ అధికారులను సంప్రదించవచ్చని కొన్ని రకాల చెట్లు అటవీశాఖ వారు ఉచితంగా సరఫరా చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *