ఫోటో రైట్ అప్ మీడియా సమావేశంలో డిఎస్పీ దృశ్యం

Spread the love

ఫోటో రైట్ అప్ మీడియా సమావేశంలో డిఎస్పీ దృశ్యం
హత్య కేసును చేధించిన పోలీసులు
ఐదుగురు ముద్దాయిలు అరెస్ట్

కార్వేటినగరం జనవరి గరుడ న్యూస్ కార్వేటినగరం సర్కిల్ కార్యాలయంలో హత్య జరిగిన రెండు రోజుల్లో నే కేసును చేదించి నట్లు పుత్తూరు డిఎస్పి యశ్వంత్ తెలిపారు ఈ కార్యక్రమంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వెదురుకుప్పం మండలం ఎగువ కనకాపురం గ్రామంలో నారాయణ రెడ్డి మరియు విజయ్ శేఖర్ రెడ్డి కుటుంబాల మధ్య గత 30 సంవత్సరాలుగా భూముల విషయంగా తగాదా ఉన్నది. ఈ విషయం గా చాలామార్లు గ్రామంలోని ఒకరినొకరు కొట్టుకొని తిట్టుకొని ఊరిలోనే సర్దుబాటు చేసుకునే వారు ఈ క్రమంలో నారాయణ రెడ్డి విజయ శేఖర్ రెడ్డి పొలానికి వెళ్లడానికి దారి లేకుండా చేసి ఫెన్సింగ్ వేసి చెట్లు నాటాడు సదరు విషయంగా అడిగినందుకు నారాయణ రెడ్డి మరియు అతని కుమారుడు మేఘనాథ్ రెడ్డి భార్య పద్మ( పద్మావతి) బెదిరించడం కొట్టడం చేస్తూ ఉండేవారు 2021 జనవరి 5 రాత్రి 10 గంటలకు విజయ శేఖర్ రెడ్డి కి చెందిన పొలం సర్వే నెంబర్57/1 లో నారాయణ రెడ్డి అతని కుటుంబ సభ్యులు అక్రమంగా ప్రవేశించి మామిడి చెట్లను నరికేశారు జనవరి 6 ఉదయం సుమారు 9:30 గంటలకు విజయ్ శేఖర్ రెడ్డి అతని భార్య చంద్రకళ తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి( గణపతి) తల్లి సరస్వతి అమ్మ చెల్లెలు పార్వతి కొడుకు విగ్నేయ్ లతో కలిసి మామిడి చెట్లు ఎందుకు నరికి నావు అని అడగడానికి వెళితే నారాయణరెడ్డి కొడుకు మేఘనాథ్ రెడ్డి భార్య పద్మా మరియు అతని బావమరిది శ్రీరాములు రెడ్డి శ్రీనివాసులు రెడ్డి భార్య ప్రమీల ముందస్తు చేసుకున్న ప్రణాళిక ప్రకారం పద్మా వద్ద కార్ పొడి మరియు కత్తులు ఉంచుకొని నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు పొలంలోకి వెళ్ళగానే వారిపై కారంపొడి చెల్లి కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు.
గంటలలో చంద్రకళ పొడిచిన గాయాలతో కోలుకోలేక చనిపోయినది మిగిలిన విజయ్ శేఖర్ రెడ్డి, తల్లి, తమ్ముడు ,మరదలు సిఎంసి వేలూరు లో చికిత్స పొందుతూ ఉన్నారు ఈ దర్యాప్తులో నేరం జరిగిన వీడియోలను సీజ్ చేసి నేరానికి సంబంధించిన ముద్దాయిలను నారాయణ రెడ్డి, పద్మ ,మేఘనాథ్ రెడ్డి, శ్రీరాములు రెడ్డి ,ప్రమీలను 8 వ తేదీ ఉదయం 9 గంటలకు సింగమ వాండ్ల ఊరు( పెనుమూరు లో అరెస్టు చేసి వారి నేరానికి ఉపయోగించిన కత్తులను , మిరప్పొడి నీ స్వాధీనం చేసుకున్నారు అనంతరం ఈ కార్యక్రమంలో సీఐ చంద్రశేఖర్,si మనోహర్ వెదురుకుప్పం ఎస్ ఐ లోకేష్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ మురళి, సుదర్శన్ రాజు ,రమేష్ పోలీసు బాలాజీ ,రాజశేఖర్ ,గోపి లు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *