వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న కలెక్టర్ భరత్గుప్తా

Spread the love

 

11 న 2వ విడత అమ్మఒడి కార్యక్రమాన్ని ..
పండుగ వాతావరణం లో ప్రతి పాఠశాలలో
నిర్వ హించండి
నాడు -నేడు పనులను వేగవంతం చేయండి..
విద్యార్థులకు నైతిక విలువల తో కూడిన వి ద్యను అందించేoదుకు ప్రతి ఒక్క ఉపాధ్యాయు డు కృషి చేయాలి
జిల్లా కలె క్టర్ భరత్ గుప్త

చిత్తూరు జనవరి 8 (గరుడ న్యూస్ )

 

రాష్ట్ర ప్రభుత్వం విద్యాభి వృద్ధి లో భాగంగా ప్రతిష్టా త్మకంగా ఈ నెల 11 న 2వ విడత అమ్మఒడి కార్యక్ర మాన్ని పండుగ వాతావర ణం లో ప్రతి పాఠశాలలో నిర్వహించాలని జిల్లా కలె క్టర్ భరత్ గుప్త మండల విద్యా శాఖాధి కారులను, ప్రధానోపాధ్యా యులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం జిల్లా సచివాలయం లోని సమా వేశపు మందిరం లో వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా మండల విద్యా శాఖాధికా రులు, ప్రధానోపాధ్యా యులతో నాడు-నేడు క్రింద పాఠశాలలో జరుగుతున్న పనుల పై జిల్లా సంయుక్త కలెక్టర్ వి.వీర బ్రహ్మo తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షా నిర్వహించారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం విద్యా సంస్కరణ లో భాగంగా పిల్లల బంగారు భవిష్యత్తు బాటలు వేస్తూ తీసుకొనివచ్చిన అమ్మఒడి కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా లో 2020 జనవరి 9న రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి లాంఛ నం గా ప్రారంభించారని చెప్పారు. అర్హులైన తల్లుల ఖాతాల లోకి మొదటి విడత లో రూ.15 వేలు జమచేయడం జరిగిందని, జిల్లా వ్యాప్తంగా ఈ నెల 11న 2వ విడత అమ్మఒడి కార్యక్రమాన్ని అన్నీ పాఠశాలలో పండుగ వాతావరణం లో నిర్వహిం చాలని కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని అందరూ వీక్షించే లా ఏర్పాట్లు చేయాలని , చిత్తూరు కు సంబందించి నాగయ్య కళాక్షేత్రం లో ఈ కార్యక్రమా న్ని నిర్వహించడం జరుగు తుందని తెలిపారు. జగన న్న గోరుముద్ద, చదవడం నాకు ఇష్టం, జగనన్న విద్యా కానుక లాంటి కార్యక్రమాల ద్వారా విద్యా వ్యవస్థ లో పలు మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. దీనితో పాటు ప్రభుత్వ
పాఠశాలల రూపు రేఖలను మారుస్తూ తీసుకువచ్చిన నాడూ-నేడు కార్యక్రమంను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయడం జరుగుతోందన్నారు. కార్పొరేట్ పాట శాలలకు దీటుగా ప్రభుత్వ పాటశాలలు సిద్దం అవుతు న్నాయని తెలిపారు. ప్రతి ప్రభుత్వ పాటశాలలో విద్యా ర్థుల నమోదు సంఖ్య పెరు గు తున్న నేపధ్యం లో ఉపా ధ్యాయుల పైనా మరింత బాద్యత ఏర్పడుతుందని, విద్యార్థులకు నైతిక విలువ ల తో కూడిన విద్యను అందించేoదుకు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కృషి చే యాలని ఈ దిశగా విద్యా శాఖ సన్నద్ధం కావాలని కలెక్టర్ సూచించారు.

జిల్లా వ్యాప్తంగా నాడు-నేడు క్రింద ఎంపిక చేసిన
పాఠశాలలో జరుగుతున్న పనుల పురోగతిని వేగవంతం చే యాలని , ఫిబ్రవరి నాటికి అన్నీ పనులు పూర్తి స్థాయిలో పూర్తి కావాలని ఆదేశించారు. మేజర్, మైనర్ రిపెర్ లలో భాగంగా నీటి సదుపాయంతో కూడిన మరుగుదొడ్ల, త్రాగు నీటి వసతి, విద్యుధీకరణ పను లను ఈ నెల 11 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాలలో పెయింటింగ్ పనులకి సం బందించి అవసరమైన మెటీ రీయల్ కొనుగోలు, చిత్రీక రించే చిత్రాలకు సంబందించి తుది నిర్ణయం తీసుకొని ఈ పెయింటింగ్ పనుల పర్య వేక్షణ బాద్యతలు డ్రాయింగ్ టీచర్ కి అప్పజెప్పాలని సూచించారు. నాబార్డ్ కింద చేసే పనులకు సంబందించి ఏ.ఈ లు ఎప్పటికప్పుడు చెక్ మెజర్మెంట్ ను అప్ లోడ్ చేయాలని కలెక్టర్ అన్నారు . ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కొఆర్డినేటర్ వెంకటరమణ రెడ్డి, సెక్టోరియల్ అధికారు లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *