వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు * వైఎస్ విజయమ్మను.. * మర్యాద పూర్వకంగా కలిసిన చెవిరెడ్డి

Spread the love

 

తిరుపతి,

వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ను ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తనయుడు, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు మోహిత్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. తిరుపతిలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వైఎస్ విజయమ్మ హాజరయ్యారు. ఈ క్రమంలో శుక్రవారం చెవిరెడ్డి కలిశారు. మూడు దశాబ్దాల కాలంగా చెవిరెడ్డి కి వైఎస్ కుటుంబంతో ఉన్న అనుబంధం తెలిసిందే. అంతే కాకుండా 2019 శాసన సభ ఎన్నికల్లో చెవిరెడ్డి తరపున ప్రచార నిమిత్తం ప్రత్యేకంగా చంద్రగిరి నియోజకవర్గానికి వైఎస్ విజయమ్మ విచ్చేసిన విషయం విదితమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *