కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరిన వైకాపా ఎంపీలు

దిల్లీ: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేసే అంశాన్ని రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నారని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని.. ప్రైవేటీకరణకు వైకాపా ప్రభుత్వం వ్యతిరేకమని చెప్పారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు. దిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన అనంతరం సహచర ఎంపీ మిథున్‌రెడ్డితో కలిసి విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. తెదేపా హయాంలో 56 సంస్థలను అమ్మేశారని.. అలాంటిది విశాఖ ఉక్కు కర్మాగారం కోసం పోరాడతామంటూ తెదేపా అధినేత చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ అంశంపై నిర్మలా సీతారామన్‌కు పలు సూచనలు చేసినట్లు చెప్పారు.