భారీఎత్తున పట్టుబడ్డ కల్తీమద్యం తయారీ పరికరాలు

Spread the love

 

!)పట్టుబడ్డ తయారీ దారుడు,వాహనం స్వాధీనం
!!)వెల్లడించిన ఎస్ ఈ బి అధికారి నిశాంత్ రెడ్డి

పలమనేరు, గరుడ న్యూస్,అక్టోబర్ 20

భారీ ఎత్తున పట్టుబడ్డ కల్తీమద్యం, తయారీ యూనిట్,మిగిలిన పరికరాలను వాహనముతో పాటు నిందితుడిని పట్టుకున్నట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి నిశాంత్ రెడ్డి వెల్లడించారు.
ఆయన మంగళవారం గంగవరం పోలీసు స్టేషన్ వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన కథనం ప్రకారం…. గంగవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన ఆళ్ల కుప్పం వద్ద ఎస్ ఐ సుధాకర్ రెడ్డి జిల్లా ఉన్నతాధికారులు ఆదేశానుసారం తన సిబంధితో సోమవారం రాత్రి వాహనాలు తనికీ చేస్తుండగా అనుమానంతో ఓ కారును వెంబడించి తన సిబంధితో పట్టుకున్నారు.అందులో నాలుగు అట్ట పెట్టెలలో మద్యం బాటిళ్లు,ఇంకనూ ఎనిమిది అట్ట పెట్టెలలో 384 క్వార్టర్ బాటిల్స్,10 కాన్ లు,మద్యం బాటిల్స్ కు వేసే మూతలు బిగించే సీలింగ్ మిషన్,400 మూతలు లేని ప్లాస్టిక్ బాటల్స్ మరో 300 మూతలేని గాజు క్వార్టర్ బాటిల్స్ పట్టుబడ్డాయి.కాగా ముద్దాయి బెంగళూరు విశ్వనాధపురం కు చెందిన పకీరప్ప కుమారుడు శశికుమార్(42)ఇది వరలో 2014 లోనే గంగవరం,పెద్ద పంజాని పోలీసు స్టేషన్లలో కల్తీ మద్యం కేసులో వున్నదని తెలిపారు.కారును స్వాధీనం చేసుకొని ముద్దాయిని అరెస్ట్ చేశామన్నారు.కార్యక్రమంలో డిఎస్పీ ఆరీఫుల్లా,రూరల్ సి ఐ రామకృష్ణ మాచారి,ఎస్ఐ సుధాకర్ రెడ్డి,ఎ ఎస్ ఐ అశ్వర్థ, పోలీసు సిబంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *