జూదం ఆడువారిపై మెరుపు దాడి

సుమారు రూ. 4,40,000/- నగదు స్వాదీనం
తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ ఏ.రమేష్ రెడ్డి ఐ.పి.యస్ గారి ఆదేశాల మేరకు యస్.బి డి.యస్.పి శ్రీ గంగయ్య వారి అధ్వర్యంలో జిల్లా యస్.పి గారి స్పెషల్ టీం, ఈస్ట్ సి.ఐ, తిరుచానూర్ సి.ఐ వారు కచ్చితమైన సమాచారం మేరకు శ్రీకాళహస్తి, తొట్టంబేడు కాసారం గ్రామం ప్రాంతంలో జూదం అడువారుపై మెరుపుదాడి చేసి 17 జూదరులను పట్టుకోవడం జరిగింది. వీరి వద్ద నుండి 03 కార్లు, 12 ద్విచక్ర వాహనాలు, 17 సెల్ ఫోన్లు రూ. 4,40,000/- నగదును స్వాదీనం చేసుకోవడం జరిగింది.
జిల్లా యస్.పి:
జిల్లాలో జూదం తదితర అసాంఘిక కార్యకలాపాలుకు పాల్పడితే సహించేదిలేదు, ఎక్కడైనా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నా, సమాచారం వున్నా పోలీస్ వారికి తెలియజేస్తే కఠిన చర్యలు తీసుకుంటాము. ప్రత్యేక పోలీస్ దళాలు జిల్లా అంతటా అసాంఘిక కార్యకలాపాలుకు పాల్పడే వారిపై నిఘా ఉంచడం జరుగుతుంది.