ఘర్షణ లో గాయపడ్డి మృతి చెందిన మహిళ.

పోటోరైటప్:(వికెయం01)ఘర్షణ లో గాయపడ్డి మృతి చెందిన మహిళ.
(వికెయం02)మృతి చెందిన మహిళ చంద్ర కళా (పైల్ పోటో)
(వికెయం03)సంఘటన స్థలాని పరిసిలిస్తున్న పోలీసులు. (వికెయం04)పొల్లాలో నరికిన చిన్న చిన్న మామిడి చెట్లు.
ఎగువ కనికాపురంలో దారి కోసం దారుణం..!
— ఓక్క కుటుంబంపై మరో కుటుంభం దౌర్జన్యం.
— కారం చల్లి కత్తులతో ముక్కుమడి దాడి
— ఈ ఘటన లో మహిళ మృతి- ముగ్గురు పరిస్థితి విషమం.
వెదురుకుప్పం; జనవరి06 (గరుడ
పొలాల మధ్యలో దారితెచ్చిన తంటా..రెండు కుటుంబాల మధ్య కొన్ని సంవత్సరాలుగా తరచుగా గోడవలు..ఓక్క కుటుంబంపై మరో కుటుంభం కారంచల్లి కత్తులతో ముక్కుమడి దాడి..ఈ ఘటన లో మహిళా మృతి.. ముగ్గురు పరిస్థితి విషమం అయినా సంఘటన వెదురుకుప్పం మండలం లో బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు… మండలం లోని ఎగువ కనికాపురం గ్రామానికి చెందిన ఎస్ నారాయణ రెడ్డి మరియు విజయశేఖర్ రెడ్డి లకు సంబంధించిన వ్వవసాయ పొలం గ్రామానికి సమీపంలో ఉన్నయి.అయితే అంకీరెడ్డి చెరువు నుంచి దిగువ కనికాపురం కు వేళ్ళె వంకలో గ్రామస్తులంతా వేళ్ళీ వాళ్ళు.ఈ వంకకు ఇరువైపులా నారాయణ రెడ్డి కి,విజయశేఖర్ రెడ్డి కి సంబంధించిన పొల్లాలు ఉన్నయి.కొన్ని సంవత్సరాలుగా ఇద్దరి కి తరచుగా గోడవలు పడ్డేవాలని గ్రామస్తులు చెబుతున్నారు.ఈ క్రమంలో మంగళవారం రాత్రి విజయశేఖర్ రెడ్డి కి సంబంధించిన పొలం లో దౌర్జన్యం నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు చెట్లు నరికేశారు.బుధవారం ఉదయం వెళ్ళి చుసినా విజయశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు నారాయణ రెడ్డి కి సంబంధించిన పొలం లో చిన్న మామిడి చెట్లను పెరికేసినారు.దీంతో రెండు కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పతకం ప్రకారమే నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు పద్మావతమ్మ ,ఎస్ మేఘనాధరెడ్డి లు ప్రత్యర్థి అయిన విజయ శేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు 1.చంద్రకళా(40),2.సరస్వతమ్మ(60),3.చంద్రశేఖర్ రెడ్డి(40),4.ఉషా(35),5.విజ్ఞాయ్(14)లపై ముక్కుమడి గా కారంచల్లి కత్తులతో దాడి చేశారు.ఈ ఘటన లో చంద్రకళా,ఉషా,సరస్వతమ్మ, విజయశేఖర్ రెడ్డి,చంద్ర శేఖర్ రెడ్డి,విజ్ఞాయ్ లు తీవ్రంగా గాయపడ్డారు.గమనించిన స్థానికులు గాయపడ్డిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ చంద్రకళా మృతి చెందారు.మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో వెల్లూరు సిఎంసికీ తరలించినట్లు స్థానికులు తెలిపారు.నిందితులు ముగ్గురు నారాయణ రెడ్డి, పద్మావతమ్మ,మేఘనాధరెడ్డి లు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.విషయం తెలుసుకున్న వెదురుకుప్పం ఎస్ ఐ లోకేష్ రెడ్డి,కార్వేటీ నగరం సిఐ చంద్ర శేఖర్ లు సంఘటన స్థలానికి చేరుకుని అక్కడ పరిస్థితిని విచారించి జరిగిన సంఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.