బీరూట్ పేలుళ్లలో ఐదుగురు భారతీయులకు గాయాలు

Spread the love

న్యూఢిల్లీ: లెబనాన్ రాజధాని బీరూట్‌లోని ఓడరేవులో మంగళవారం జరిగిన భారీ పేలుళ్లలో ఐదుగురు భారతీయులు గాయపడినట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. అక్కడ భారతీయులంతా క్షేమంగా ఉన్నారని, భారత రాయబార కార్యాలయం ఎప్పటికప్పుడు వారితో మాట్లాడుతున్నదని, వారికి అవసరమైన సహాయాన్ని అందిస్తున్నామని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ తెలిపారు. పేలుళ్ల వల్ల జరిగిన నష్టాన్ని అంచనావేయాలని లెబనాన్ ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. దాన్నిబట్టి సహాయం అందిస్తామన్నారు.

బీరూట్ సముద్ర తీరంలోని ఓడరేవులో ఓ గోదాంలో నిలువ ఉంచిన 2750 టన్నుల అమ్మోనియం నైట్రేట్ పేలడంతో గత మంగళవారం భారీ ప్రమాదం సంభవించింది. ఇందులో 130 మంది మరణించగా, నాలుగువేలకు పైగా మంది గాయపడ్డారు. దీని తీవ్రతో ఓడరేవుకు చుట్టుపక్కల ఉన్న నిర్మాణాలన్నీ నేలమట్టమయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *