జపాన్, దక్షిణ కొరియాల్లో హైషెన్ తుఫాను బీభత్సం

Spread the love

సోక్చో (దక్షిణ కొరియా) : సోమవారం శక్తివంతమైన తుపాను దక్షిణ కొరియాను తాకింది. రికార్డుస్థాయిలో ఈదురు గాలులు, భారీ వర్షాలతో దక్షిణ జపాన్‌ను అతలాకుతలం చేసిన తర్వాత సోమవారం దక్షిణ కొరియాలో తన ప్రభావాన్ని చూపిస్తోంది. జపాన్‌లో తుఫాను ధాటికి ఐదు లక్షల మంది ప్రజలు విద్యుత్‌ లేక అంథకారంలో మగ్గుతున్నారు. జపాన్‌లోని దక్షిణ ప్రాంత దీవి అయిన కైయుషుపై హైషెన్‌ తుపాను విరుచుకుపడింది. భారీ వర్షాల కారణంగా కొండచరియ కూలి నలుగురు మరణించారు. ఆ బురద, నీళ్ళలోనే సహాయక సిబ్బంది తమ కార్యకలాపాలు కొనసాగిస్తు న్నారు. ఇళ్ల పై కప్పులు లేచిపోయాయని, ఇళ్ళలోకి అర మీటరు లోతు నీళ్ళు వచ్చేశాయని పోలీసు అధికారులు తెలిపారు. టోక్యోలో చీఫ్‌ క్యాబినెట్‌ కార్యదర్శి యోషిడే సుగా విలేకర్లతో మాట్లాడుతూ, శనివారం ఒకినోవాలో సంభవించిన హైషెన్‌ తుపాను ఆదివారం నాటికి ఉత్తర దిశగా కదిలిందనీ, దాదాపు 18లక్షలమంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళాళ్సిందిగా కోరామని చెప్పారు. గంటకు 200కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని, దీంతో జపాన్‌లో చెక్క గృహాలన్నీ చెల్లాచెదురై పోయా యని తెలిపారు. సోమవారం మధ్యాహ్నానికి తుపాను దక్షిణ కొరియాను తాకింది. తుఫాను తాకిడితో వందలాది విమానాలు రద్దయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *