కాలిఫోర్నియా అడవుల్లో దావానలం

కాలిఫోర్నియా : సియర్రా నేషనల్ ఫారెస్ట్‌లో దావానలం చెలరేగింది. ఈ ప్రభావంతో కాలిఫోర్నియా ప్రాంతంలో ఆకాశంలోకి 50వేల అడుగుల ఎత్తున పొగలు దట్టంగా అలుముకున్నాయి. ఈ కారణంగా శని, ఆదివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా వేడిగాలులు ప్రారంభమయ్యాయి. అమెరికా నేషనల్ ఫారెస్ట్‌లో చిక్కుకుపోయిన వందలాదిమందిని కాపాడేందుకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు. ‘క్లైమేట్ ఎమర్జన్సీ (అత్యవసర పరిస్థితి) విధిస్తూ తాజాగా హెచ్చరికలు చేశారు. ఇప్పటికి ఈ దావానలంతో దాదాపు 36వేల ఎకరాల్లో అడవి అంతా దగ్ధమై పోయింది. ఆదివారం నాటికి అక్కడ పూర్తి స్థాయిలో బూడిద కుప్పలు మిగిలాయి. దీంతో సైన్యం సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. పార్క్‌లోని స్విమ్మింగ్ రిజర్వాయర్ వద్ద కేంప్ వేసిన 200మందికి పైగా కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నారు.