ఆకాశం నీ హద్దురా ఫస్ట్ లుక్

Spread the love

సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సూరారై పొట్రు’. ‘గురు’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా   తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ అనే పేరుతో విడుదలకానుంది.  సామాన్యుడికి సైతం విమాన సౌకర్యం అందించిన ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపీనాథ్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇటీవల సెన్సార్ పనులను పూర్తి చేసుకున్న ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాకి సెన్సార్ బోర్డు వారు ఎలాంటి కటింగ్స్ లేకుండా క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ జారీ చేశారు. కాగా తాజాగా ఈ సినిమాకి సంభందించిన అప్డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. జీవీ ప్రకాష్ స్వరపరిచిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాలోని ‘కాటుక కనులే..’ అనే సాంగ్ 1 నిమిషం వీడియో జూలై 23 ఉదయం 10 గంటలకు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ పాటని ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ దీక్షిత (దీ) ఆలపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *