రానా పెళ్లిపై బాలీవుడ్ హీరో ఆసక్తికర కామెంట్

Spread the love

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రానా దగ్గుబాటి ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఈ రోజే (ఆగస్టు 8) రానా- మిహికా వివాహ వేడుక జరగనుంది. వేదమంత్రాల నడుమ అత్యంత సన్నిహితుల మధ్య జరగనున్న ఘనంగా జరగనున్న ఈ వేడుకకు హైదరాబాద్ రామానాయుడు స్టూడియో వేదిక కానుంది. ఈ మేరకు రామానాయుడు స్టూడియోలో అన్ని సదుపాయాలతో పెళ్లి ఏర్పాట్లు, కళ్ళు చెదిరే డెకరేషన్ చేయించారట . కాగా రానా- మిహికాలకి స్నేహితులు, సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ హీరో అక్షయ్ కుమార్ ట్విటర్ ద్వారా రానాకు విషెస్ తెలియజేశాడు. `శాశ్వతంగా లాక్డ్-డౌన్ కావడానికి ఇదే సరైన మార్గం. కంగ్రాట్స్ రానా.. మీరిద్దరూ జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని అక్షయ్ ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *