జనవరి 29 నుంచి పార్లమెంట్ సమావేశాలు…

Spread the love

జనవరి 29 వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాలను రెండు విడతలుగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలివిడత సమావేశాలు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు, రెండో విడత సమావేశాలను మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వ తేదీ వరకు జరగబోతున్నాయి. జనవరి 29 వ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభమైతే, ఫిబ్రవరి 1 వ తేదీన కేంద్రం బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నది. కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనలు పాటిస్తూ ఉభయసభలను నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఉభయసభలను చెరో 4 గంటల పాటు నిర్వహించేలా ప్లాన్ చేసింది. జనవరి 29 వ తేదీన ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *