భాజపాలో చేరిన విజయశాంతి

Spread the love
దిల్లీ: కాంగ్రెస్ ప్రచారకమిటీ ఛైర్పర్సన్ విజయశాంతి భాజపాలో చేరారు. దిల్లీలో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. కాషాయ కండువాను కప్పి అరుణ్ సింగ్ ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ… 1998 జనవరి 26న తొలుత భాజపాలో చేరానన్నారు. అప్పట్లో తెలంగాణ ఏర్పాటుకు భాజపా అనుకూలంగా లేకపోవడం వల్ల బయటకొచ్చానన్నారు. అయితే పార్టీ విధివిధానాలు నచ్చడం వల్ల తిరిగి భాజపాలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు పాల్గొ్న్నారు.