ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు

Spread the love

మహబూబ్‌నగర్ : జిల్లాలోని ప్రభుత్వ భూములను ఆక్రమించాడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని సంబంధిత అధికారులను మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ ఆదేశించారు. జిల్లా కేంద్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి మీడియాతో మాట్లాడారు. జిల్లా కేంద్రంలో ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నా అవి పేదలకు చెందేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేయాలని ప్రయత్నిస్తే ఎంతటి వారినైనా సహించేది లేదన్నారు.

ప్రభుత్వ ఆస్తులను, భూములను కాపాడాలన్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేయాలనుకునే వారి వివరాలను తనకు ఇస్తే వారి సంగతి చూస్తానని హెచ్చరించారు. పేద ప్రజల జోలికి వెళ్లి వారిని మోసం చేస్తే పాపం తగులుతుందన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని రకాల పథకాలు పేదలకు ఉచితంగా అందాలన్నారు. ఎవరైనా మధ్యవర్తులు జోక్యం చేసుకొని పేదలను మోసం చేయాలని చూస్తే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *